రాజమౌళి: ‘మాటలు చాలవు’... ‘జై లవకుశ’లో తారక్ నటనపై దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం
తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘జై లవకుశ’ సినిమా ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటనపై సర్వత్ర ప్రశంసలు వస్తున్నాయి. జై, లవ కుమార్, కుశ పాత్రలు మూడింటికీ ఎన్టీఆర్ సరైన న్యాయం చేశాడని, ఆ పాత్రల్లో జీవించేశాడని ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు.
ఈ సినిమాను చూసిన దర్శక ధీరుడు రాజమౌళి తన హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోందని, తారక్ నటనను వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. జై ‘జై’ అని అన్నారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ డ్రామా అన్నిటినీ ఈ సినిమాలో చూడవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.