: సస్పెండ్ చేయడం ఆనందదాయకమే: ద్వారంపూడి
కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా వుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ నుంచి తమను పంపించివేయడం ఆనందదాయకమేనని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి తాను కూడా రాజీనామా చేశాననీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాననీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. త్వరలో మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఇందులో బొత్సా సత్యనారాయణ సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా వున్నారని ఆయన నవ్వుతూ అన్నారు.