రాజన్న సిరిసిల్ల జిల్లా : సొరంగంలో కూలిన పై కప్పు... ఆరుగురి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీ పనులు జరుగుతుండగా సొరంగంలో పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సిబ్బంది అందులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ విశ్వజిత్, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసి, అక్కడే ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించాలని యోచిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు జార్ఖండ్, బీహార్ వాసులని తెలుస్తోంది.