రాజ్ తరుణ్: మహేశ్ బాబుతో కలిసి నటించాల్సి వస్తే విలన్ గా చేస్తాను: రాజ్ తరుణ్
- కారులో వెళితే కాస్త రక్షణ ఎక్కువుంటుందని నేను కారులోనే వెళతా
- మహేశ్ బాబు సినిమాల్లో నాకు ఇష్టమైన మూవీ ‘ఒక్కడు’
- ఎన్టీఆర్ సినిమాల్లో ఇష్టమైంది ‘స్టూడెంట్ నెంబర్ 1’
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ వస్తే ఆయనకు సోదరుడిగా నటిస్తావా? అని తన అభిమాని అడిగిన ప్రశ్నకు యువ నటుడు రాజ్ తరుణ్ స్పందిస్తూ.. విలన్‌గా నటిస్తానని చెప్పాడు. ఈ రోజు ట్విట్టర్‌లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు రాజ్ తరుణ్ సరదాగా సమాధానాలు ఇచ్చాడు. ‘నీకు బైక్ పై వెళ్లడం అంటే ఇష్టమా? కారులో వెళ్లడమంటేనా?’ అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తనకు బైక్‌పై వెళ్లడం అంటేనే ఇష్టమని, కానీ, కారులో వెళితే కాస్త రక్షణ ఎక్కువుంటుందని కారులోనే వెళతానని చెప్పాడు.
‘అన్నా, మొన్న బిజీగా ఉండి టీవీలో 'అంధగాడు' సినిమా చూడలేకపోయాను.. మళ్లీ వేయమని జెమిని టీవీ వాళ్లకి చెప్పు’ అని ఓ అభిమాని రాజ్‌తరుణ్‌ని కోరాడు. దానికి రాజ్ తరుణ్ ‘తప్పకుండా’ అని సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పు అని ఒకరు అడగగా, ‘బాహుబలి’ అని రాజ్‌తరుణ్ చెప్పాడు. ‘ఒక మంచి మాట చెప్పు’ అని ఒక అభిమాని అడగగా, ‘అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని సినిమా డైలాగ్ చెప్పాడు. మహేశ్ బాబు సినిమాల్లో తనకి ఇష్టమైన మూవీ ఒక్కడు అని, ఎన్టీఆర్ సినిమాల్లో ఇష్టమైంది స్టూడెంట్ నెంబర్ 1 అని అన్నాడు.