చైనా: హైవేపై భారీ ట్రక్‌కి మంటలు... అయినా అలాగే ముందుకు తీసుకెళ్లిన డ్రైవర్!
హైవేపై మంటలు అంటుకున్న ఓ ట్రక్ అలాగే మూడు కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. దాని వెనుక భాగంలో మంటలు రేగడాన్ని గమనించకుండా ఆ డ్రైవర్ అలాగే ముందుకు తీసుకెళ్లి చివరకు ఓ టోల్‌ప్లాజా వద్ద ఆపాడు. రోడ్డుపై అది మంటలు, పొగలు కక్కుతూ వెళ్లిన తీరు ఎంతో ప్రమాదకరంగా కనిపించింది. టోల్ ప్లాజా వద్దకు అది చేరుకుంటుండగా అక్కడి సిబ్బంది ఆ ట్రక్కుకి దూరంగా పరుగెత్తారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మంటలను ఆర్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.