పెట్రోలియం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆశ్ర‌యించ‌నున్న‌ పెట్రోలియం డీల‌ర్ల అసోసియేష‌న్!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెట్రోలియం డీల‌ర్ల అసోసియేష‌న్ స‌భ్యులు త‌మ సమ‌స్య‌ల‌ను సినీన‌టుడు, జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విష‌య‌మై ఈ రోజు గుంటూరు జిల్లాలో వారు జ‌న‌సేన నేత‌ల‌ను క‌లిసి చ‌ర్చించారు. తమ సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల‌ని పెట్రోలియం డీల‌ర్ల అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు రావి గోపాల‌కృష్ణ విన‌తి ప‌త్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన జ‌న‌సేన నేత‌లు ద‌స‌రా ఉత్స‌వాల త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News