నేపాల్ : వ్యూహాత్మక హైవే రోడ్డును ప్రారంభించిన చైనా!
- టిబెట్ మీదుగా నేపాల్ సరిహద్దు వరకు రోడ్డు
- ఆర్థికంగా, రక్షణ పరంగా ఉపయోగిస్తామన్న చైనా
- ఇక నేపాల్‌కు రైల్వే లైన్ విస్తరించే దిశగా సులువు కానున్న పనులు
టిబెట్ మీదుగా నేపాల్ సరిహద్దు వరకు 40.4 కిలో మీటర్ల పొడవుతో చైనా వ్యూహాత్మక హైవే రోడ్డును ప్రారంభించింది. దక్షిణాసియా ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కోసమే కాకుండా, అవసరమైతే దీనిని రక్షణ అవసరాల కోసం కూడా వినియోగిస్తామని చైనా తెలిపింది. నేపాల్ సరిహద్దుతోనూ ఈ రోడ్డును అనుసంధానించింది. ఈ హైవే ద్వారా ప్రయాణ సమయం తగ్గుతుంది.
ఆర్థికంగా, రక్షణ పరంగా కూడా దక్షిణాసియా ప్రాంతాల్లో సంబంధాలు మెరుగవుతాయని చైనా తెలిపింది. నేపాల్ ప్రధానిగా కేపీ ఓలి ఉన్న సమయంలో చైనా ఆ దేశంలో ఓ రైల్వే లైన్ వేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఓలి ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత ఆ పనులు మెల్లిగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రారంభించిన హైవేను ఉపయోగించుకుంటే రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తవుతాయి.