పవన్ కల్యాణ్: జనసేన ఆన్ లైన్ సభ్యత్వాలపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్!
జనసేన సైనికుల ఎంపికలను పూర్తి చేసిన ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో సభ్యత్వాలపై దృష్టిపెట్టారు. ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు విధానంపై ఐటీ నిపుణులతో పవన్ సమీక్ష జరుపుతున్నారు. త్వరలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. తాను అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన పవన్ కల్యాణ్ అందుకోసం కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేమని పవన్ ఇటీవలే తెలిపారు.