దిల్ రాజు: దిల్ రాజుపై నవలా రచయిత్రి శ్యామలారాణి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!
- ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ సినిమా కథ తనదేనన్న రచయిత్రి
- కాపీ రైట్స్ చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
- ఏప్రిల్ 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’
ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ సినిమాలో తన నవలలోని కథను కాపీ కొట్టారని ‘నా మనస్సు నిన్ను కోరె’ నవల రచయిత్రి శ్యామలారాణి మండిపడ్డారు. ఈ మేరకు ఆ సినిమా నిర్మాత దిల్ రాజుపై హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ రోజు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు నిర్మాతపై కాపీ రైట్స్ చట్టాల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా ఏప్రిల్ 2011లో విడుదలైంది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్, తాప్సీ నటించారు. డార్లింగ్ సినిమా తరువాత ప్రభాస్ మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో నటించాడు. ఆ సమయంలో వరుస ప్లాప్‌లతో ఉన్న ప్రభాస్.. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో మళ్లీ హిట్ల బాటపట్టాడు.