: నాకిద్ద‌రు పిల్ల‌లున్నారు... ఒక్క‌గానొక్క భ‌ర్త కూడా ఉన్నాడు.. భ‌య‌పెట్టొద్దు: యాంక‌ర్ సుమ‌ చమక్కులు


ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రుగుతోన్న స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమ మరోసారి తన వాక్చాతుర్యాన్ని బయటపెట్టింది. యాక్ట‌ర్, డైరెక్ట‌ర్ సూర్యను ఆమె ఈ ఈవెంట్‌లో భాగంగా వేదికపైకి పిలిచింది. అయితే, ఆ స‌మ‌యంలో స్పైడ‌ర్ ముసుగు ధ‌రించి ఇద్ద‌రు వ్య‌క్తులు వేదిక‌పైకి వ‌చ్చి సుమ వెనక నిలబడ్డారు. దీంతో ‘నాకిద్ద‌రు పిల్ల‌లున్నారు... ఒక్క‌గానొక్క భ‌ర్త కూడా ఉన్నాడు.. భ‌య‌పెట్టొద్ద’ని జోక్ వేసింది.

అంత‌కు ముందు రామ‌జోగయ్య శాస్త్రి మాట్లాడిన త‌రువాత కూడా ఓ పంచ్ వేసింది. రామ జోగయ్య శాస్త్రి ఇలా పాట‌లు రాసుకుంటూ పోతూ మ‌హేశ్ బాబు కుమారుడు హీరోగా వ‌చ్చే సినిమాకి కూడా పాట‌లు రాయాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపింది. దానికి కూడా తానే యాంకరింగ్ చేయాలని వ్యాఖ్యానించింది. 

  • Loading...

More Telugu News