: మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమాలో ‘సిసిలియా’ అంటే ఏంటో తెలుసా?
మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమాలోని ‘హే పిల్లా అచ్చచ్చా... సిసిలియా.. సిసిలియా...’ అంటూ సాగుతోన్న ఓ పాట అమితంగా అలరిస్తోన్న విషయం తెలిసిందే. అసలు సిసిలియా అంటే ఏంటో తెలుసా? ‘అందమైన అమ్మాయి’ అని తనతో రామజోగయ్య శాస్త్రి చెప్పాడని యాంకర్ సుమ చెప్పింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మహేశ్ బాబు స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ లో సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడిన తరువాత సుమ ఈ విషయం చెప్పింది.
అంతకుముందు రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ... ఈ సినిమా అద్భుత విజయం సాధించడం ఖాయమని, ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పించినందుకు మహేశ్ బాబు, మురుగ దాస్‌లకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపారు. అందరిలాగే తాను కూడా స్పైడర్ కోసం ఎదురు చూస్తానని చెప్పాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్ కన్నా ఈ ఈవెంట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.