: హీరోయిన్‌ కృతిసనన్ కి జుంకీలను కానుకగా ఇచ్చిన అభిమాని!


మ‌హేశ్ బాబు హీరోగా తెలుగులో వ‌చ్చిన ‘నేనొక్కడినే’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన‌ కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంది. ఆమె తెలుగులో ‘దోచెయ్’ సినిమాలోనూ న‌టించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రం ‘బరేలీ కీ బర్ఫీ’ తాజాగా విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది.

ఈ సినిమా షూటింగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో తీశారు. అయితే, షూటింగ్ నిర్వ‌హిస్తోన్న స‌మ‌యంలో త‌న‌కు ఓ అభిమాని... బరేలీలో తయారు చేసిన జుంకీలను కానుకగా ఇచ్చాడని ఆ అమ్మ‌డు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపి, హర్షం వ్యక్తం చేసింది. త‌న ప‌ట్ల చూపిన అభిమానానికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొంది. ఈ ట్వీట్ ఆ అమ్మడి అభిమానులకు అమితంగా ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News