: పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. నటుడు నదీర్‌ షాకు పెరిగిన రక్తపోటు!


ఓ మలయాళ నటి అపహరణ కేసులో పోలీసులు వేస్తోన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నటుడు నదీర్ షాకు రక్తపోటు పెరిగిపోయి, అస్వస్థతకు గురయ్యాడు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ నటుడు దిలీప్‌ కుమార్ కి న‌దీర్ షా మంచి స్నేహితుడు. ఇప్ప‌టికే దిలీప్ కుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో నిజానిజాలు రాబట్టడానికి ఈ రోజు నదీర్‌ షాను కేరళ పోలీసులు ప్రశ్నించారు. న‌దీర్ షా పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ విచారణ ప్రారంభిస్తామ‌ని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. న‌దీర్ షా ఇలా ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గురవ్వ‌డం ఇది తొలిసారి కాదు. గ‌త నెల విచారణకు హాజరైన స‌మ‌యంలో కూడా ఆయ‌న ఇలాగే అస్వస్థతకు గురయ్యాడు.

  • Loading...

More Telugu News