: రూ.100 కోట్లను తృణప్రాయంగా వదులుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోన్న దంపతులు
- మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఆదర్శ దంపతులు
- ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయం
- సన్యాస జీవితంలోకి అడుగుపెడుతోన్న దంపతులు
- తమ మూడేళ్ల పాపను బంధువులకు దత్తతకు ఇచ్చేసిన వైనం
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఓ దంపతులు సన్యాస జీవితం తీసుకోవాలని తీసుకున్న కఠిన నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. డబ్బే జీవితంగా, అదే లక్ష్యంగా బతుకుతోన్న ఎంతో మంది వుండే ఈ సమాజంలో ఇటువంటి వారు కూడా ఉంటారా? అనేలా ఆ దంపతులు తమ రూ.100 కోట్ల ఆస్తిని వదులుకుంటున్నారు. అంతేకాదు, అంతకు మించిన త్యాగం కూడా చేశారు. తమ మూడేళ్ల పాపకు కూడా వారు దూరంగా ఉండనున్నారు.
సుమిత్, అనామిక అనే ఈ దంపతులు సూరత్‌లో ఈ నెల 23న జైన్ సన్యాసులుగా మారనున్నారు. ఇప్పటికే తమ కుమార్తెను బంధువులకు దత్తత ఇచ్చారు. కష్టపడి సంపాదించిన ఆస్తిని, అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న కూతురిని వదిలేసి వెళ్లవద్దని వారి బంధువులు ఒత్తిడి తెచ్చినప్పటికీ ఈ దంపతులు వినలేదు. భవబంధాలను తెంచుకుని ఆధ్యాత్మిక జీవితమే లక్ష్యంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.