: స్వయంగా కారు నడుపుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కి వచ్చిన సినీ హీరో మహేశ్ బాబు
ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమా పనుల్లో బిజీబిజీగా ఉంటూనే మహేశ్ బాబు తన పర్సనల్ పనులను కూడా అంతే వేగంగా పూర్తి చేసుకుంటున్నాడు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో కార్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మహేశ్ బాబు స్వయంగా దాన్ని నడుపుకుంటూ వచ్చాడు. అనంతరం అధికారులు ఇచ్చిన దరఖాస్తులపై సంతకం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం వేలిముద్రలు ఇచ్చి ఫొటో దిగాడు. కాగా, ఈ రోజు స్పైడర్ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది.