: ట్రంప్ ట్వీట్లు ముద్రించి.. చెప్పులను విక్రయిస్తోన్న సంస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ట్విట్టర్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. న్యూస్ ఛానెళ్ల కన్నా ట్విట్టరే బెటరని కూడా ఆయన పలుసార్లు అన్నారు. ఆయన ట్వీట్లను కొన్ని కంపెనీలు వ్యాపార పరంగా కూడా ఉపయోగించుకుంటున్నాయి. అమెరికాకు చెందిన ప్రెసిడెన్షియల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనే కంపెనీ.. ట్రంప్ వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై చేసిన రెండు విరుద్ధమైన ట్వీట్లను తీసుకుని వాటిని చెప్పులపై ముద్రించి, అమ్ముకుంటోంది.
ఓ చెప్పుపై ఏముందంటే.. కొంత మంది విశ్వసనీయమైన వ్యక్తులు తన దగ్గరకు వచ్చి అధ్యక్షుడు బరాక్ ఒబామా బర్త్ సర్టిఫికెట్ నకిలీదని చెప్పారని ట్రంప్ ఆగస్టు6, 2012లో చేసిన ట్వీట్ ఉంది. మరో చెప్పుపై ఆధారాలు లేనిదే నిజాయతీ లేని మీడియా చెప్పిన వార్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సెప్టెంబర్ 30, 2016న చేసిన మరో ట్వీట్లో ఉంది.