: స్పేస్ ఎక్స్ రాకెట్ ల్యాండింగ్ వైఫల్యాల వీడియోను పోస్ట్ చేసిన ఈలాన్ మస్క్
అంతరిక్షంలోకి వెళ్లిన రాకెట్‌ను సముద్రంలో పడేసి నిరూపయోగంగా మార్చడానికి బదులు దాన్నే క్షేమంగా ల్యాండ్ చేయడం వల్ల తిరిగి వాడుకునే సదుపాయం కలుగుతుందనే ఐడియాతో ఈలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు. అయితే ఇది అసాధ్యమని చాలామంది శాస్త్రవేత్తలు అనుకున్నారు. అయితే డిసెంబర్ 2015న అది సాధ్యమని ఈలాన్ మస్క్ నిరూపించాడు. ప్రస్తుతం ఫాల్కన్ సిరీస్ రాకెట్ల ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నాడు. మరి ఈ విజయం సాధించడానికి అతను ఎన్ని వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో చాలా సార్లు చెప్పాడు.
ఇప్పుడు వాటన్నింటినీ చూపించడానికి ఫాల్కన్9 ప్రయోగంలో ఎదుర్కున్న వైఫల్యాలన్నింటినీ వివరిస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. డిసెంబర్ 2015 తర్వాత ఫాల్కన్ రాకెట్ ల్యాండింగ్‌లో విఫలమైన సంఘటనలను కూడా ఆయన వీడియోలో జత చేశారు. ఎప్పటికైనా అంగారక గ్రహం మీద మనుషులు నివసించే కాలనీ ఏర్పాటు చేసి, భూమ్మీది నుంచి అక్కడికి, అక్కడి నుంచి భూమ్మీదికి స్పేస్‌షిప్ సర్వీసులు ఏర్పాటు చేయలనేది ఈలాన్ మస్క్ కల!