: మోహన్‌బాబు కొత్త సినిమాలో ప్రత్యేక గీతంలో మెరవనున్న స్కార్లెట్, మధు స్నేహ
డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తోన్న కొత్త సినిమాలో ‘బాహుబలి’ భామలు కనిపించనున్నారు. రాజమౌళి తీసిన ఆ సినిమాలోని ‘మనోహరీ..’ పాటలో మెరిసిన స్కార్లెట్, మధు స్నేహలను మోహన్ బాబు సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేసేందుకు తీసుకున్నారట.
కథలో ఈ పాటకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఈ పాట కోసం తిరుపతిలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ పూర్తయిందని తెలిసింది. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పేరు ‘గాయత్రి’. ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. అలాగే, హాట్ యాంకర్ అనసూయ జర్నలిస్టుగా నటిస్తోంది.