: పాక్ క్రికెటర్ ఇర్ఫాన్ పై నిషేధం ఎత్తివేత!
పాకిస్థాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఇర్ఫాన్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా మ్యాచ్ లను ఫిక్స్ చేయమంటూ ఇర్ఫాన్ ను బుకీలు సంప్రదించారు. అయితే, ఈ విషయాన్ని ఇర్ఫాన్ దాయడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.
దీనికి తోడు రూ. 65 వేల జరిమానాను కూడా విధించారు. అయితే, నిషేధం మార్గదర్శకాలను ఇర్ఫాన్ పాటించిన నేపథ్యంలో, అతనిపై సస్పెన్షన్ ను ఏడాది నుంచి ఆరు నెలలకు తగ్గిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు అతను అందుబాటులో ఉండనున్నాడు.