: రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా... ట్విట్టర్‌లో రానాను బెదిరించిన నెటిజన్!
అభిమానం ముదిరితే పిచ్చి అవుతుందంటారు... ఆ పిచ్చితో వారు అభిమానించే హీరోనే బెదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అభిమాన హీరో స్పందన కోసం కొన్నిసార్లు పిచ్చి అభిమానులు హద్దులు దాటుతుంటారు. అలాంటి అభిమానుల్లో ప్రవీణ్ ఒకడు. `మీరు నాకు రిప్లై ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుని చస్తా... సూసైడ్ నోట్‌లో మీ పేర్లు రాస్తా.. ఇక మీ ఇష్టం!` అంటూ రానా, కాజల్‌లకు ప్రవీణ్ ట్విట్టర్‌లో మెసేజ్ చేశాడు. దీనికి సమాధానంగా `నీకు ఏమన్నా పిచ్చా?` అని రానా ట్వీట్ చేశాడు. దానికి ఆ అభిమాని `జస్ట్ కిడ్డింగ్ రానా, ఇలా చేయకపోతే నువ్వు రిప్లై ఇస్తావా చెప్పు` అని అడిగాడు. అయితే మిగతా నెటిజన్లు ప్రవీణ్‌ని చీల్చి చెండాడారు. తాను సరదా కోసం చేశానని ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా విభిన్న రకాలుగా చేసిన కామెంట్లు నవ్వుతెప్పిస్తున్నాయి.