: ఉత్తరకొరియా చర్యపై ఇక అంతర్జాతీయ కమ్యూనిటీ ఏకమవ్వాలి: జపాన్ పిలుపు
- తీరు మార్చుకోకపోతే ఉ.కొరియాకి భవిష్యత్తు ఉండదు
- ఐరాస తీర్మానాన్ని ఉత్తరకొరియా పట్టించుకోవడం లేదు
- ఉత్తరకొరియా దుందుడుకు చర్యపై జపాన్ ప్రధాని ఆగ్రహం
ఎన్ని హెచ్చరికలు వస్తున్నా ఎవరిమాటా వినకుండా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న ఉత్తరకొరియా తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు భగ్గుమంటున్నాయి. ఇక ఊరుకునేది లేదని ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పేందుకు రెడీ అయ్యామనేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఉత్తరకొరియా చర్యపై జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ... శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి బలమైన తీర్మానాన్ని తీసుకొస్తే మరోవైపు ఉత్తరకొరియా మాత్రం పట్టించుకోకుండా ఈ దుందుడుకు చర్యకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరకొరియా తన తీరు మార్చుకోకపోతే ఆ దేశానికి భవిష్యత్తు ఉండదని షింజో అబే హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆ దేశానికి అర్థమయ్యేలా చెబుతామని అన్నారు. ఉత్తరకొరియా చర్యపై అంతర్జాతీయ కమ్యూనిటీ ఏకమవ్వాలని కోరారు. ఉత్తరకొరియా చేసిన ప్రయోగాన్ని అమెరికా ధ్రువీకరించి, అది ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని స్పష్టం చేసింది.