: మంత్రి ఈటల కార్యక్రమంలో జాతీయ జెండాకు అవమానం
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జాతీయ జెండాను అవమానపరిచారు. తలకిందులుగా జెండాను ఆవిష్కరించి, ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జమ్మికుంటలో చోటు చేసుకుంది. వెయ్యి మందితో జాతీయగీతాలాపన కార్యక్రమం సందర్భంగా ఇది జరిగింది. ఎగురవేసిన జెండా తలకిందులుగా ఉండటంతో మంత్రితో పాటు అక్కడున్న నేతలు, అధికారులు, పోలీస్ అధికారులు షాక్ కు గురయ్యారు. వెంటనే జెండా దింపి, సరిచేసి, మళ్లీ ఎగురవేశారు. అనంతరం కార్యక్రమాన్ని ముగించారు.