: తెల్ల జిరాఫీని ఎప్పుడైనా చూశారా?... వీడియో చూడండి!
కెన్యా అడవుల్లో రెండు తెల్ల జిరాఫీలు కనిపించాయి. అక్కడి హిరోలా కన్సర్వేషన్ కేంద్రంలో స్థానిక గ్రామస్థులు వీటిని చూసి, అధికారులకు సమాచారం ఇచ్చారు. గత జూన్ నెలలో ఇవి కనిపించాయి. వాటికి సంబంధించిన వీడియోను అధికారులు యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించే ఈ జిరాఫీల సంఖ్య ఈ మధ్య పెరిగి ఉంటుందని జూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది జనవరిలో కూడా టాంజానియాలోని టారంగిరే జాతీయ పార్కులో, మార్చిలో ఇషాక్‌బినీ పార్కులో తెల్ల జిరాఫీలు కనిపించినట్లు వారు చెప్పారు. `ల్యూసిజం` అనే జన్యుసంబంధిత లోపం కారణంగా జిరాఫీలు ఇలా తెల్ల రంగులో జన్మిస్తాయని జూ అధికారులు తెలిపారు. వీటిలో చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్లు లోపించి ఉంటాయని వారు పేర్కొన్నారు.