: బన్సల్ వ్యవహారంపై కోర్ కమిటీ మల్లగుల్లాలు


మేనల్లుడి నిర్వాకం రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ మెడకు చుట్టుకుంది! ఓ అధికారికి రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తానంటూ బన్సల్ సోదరి తనయుడు విజయ్ సింగ్లా రూ.10 కోట్లు డిమాండ్ చేయడం దేశంలో సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ సింగ్లాను అరెస్టు చేసిన నేపథ్యంలో బన్సల్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని విపక్షాలు నినదిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని బన్సల్ చెబుతున్నారు.

ఈ విషయమై నిన్న సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ ఏమీ తేల్చలేకపోయింది. నేడు మరోసారి ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన భేటీ అయిన పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ ప్రధానంగా బన్సల్ వ్యవహారంపైనే చర్చ సాగిస్తోంది. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ సమావేశం అనంతరం బన్సల్ తొలగింపుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News