: పాప్ సింగర్ కి కిడ్నీ దానం చేసిన హాలీవుడ్ నటి... సర్వత్ర ప్రశంసలు!

  • హాలీవుడ్ పాప్ గాయని సెలెనా గోమెజ్ కు అరుదైన 'లూపస్' వ్యాధి
  • కిడ్నీ మార్చకుంటే ప్రాణానికే ప్రమాదమన్న వైద్యులు
  • కిడ్నీ దానమిచ్చిన నటి ఫ్రాన్సియా రైసా
  • జీవితాంతం రుణపడి ఉంటానన్న సెలెనా

శరీరంలోని మెదడు, గుండె, కిడ్నీల వంటి అవయవాలను నాశనం చేసే 'లూపస్' అనే వ్యాధి సోకిన ప్రముఖ హాలీవుడ్ పాప్ గాయని సెలెనా గోమెజ్ కు, ఆమె బెస్ట్ ఫ్రెండ్, నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానమివ్వగా, ఇప్పుడామెను పలువురు సెలబ్రిటీలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఫ్రాన్సియాతో కలసి తాను బెడ్ పై ఉన్న దృశ్యాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న సెలెనా 'నా బెస్ట్‌ ఫ్రెండే నా ప్రాణం నిలిపింది' అని ఓ ట్వీట్ పెట్టింది. తక్షణమే కిడ్నీ శస్త్రచికిత్స నిర్వహించాల్సి వుంటుందని, లేకుంటే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో, విషయం తెలుసుకున్న ఫ్రాన్సియా కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

ఇటీవలి కాలంలో తన నుంచి కొత్త ఆల్బమ్స్ రాకపోయేసరికి అభిమానుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పిన సెలెనా, లూపస్ వ్యాధి నుంచి కోలుకునేందుకు సమయం తీసుకున్నానని, కిడ్నీని బహుమతిగా ఇచ్చి ఎంతో పెద్ద త్యాగం చేసిన ఫ్రాన్సియాకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. ఇదిలావుండగా, సెలెనాకు ఆపరేషన్ జరుగుతోందని, ఫ్రాన్సియా కిడ్నీని దానం ఇస్తోందని ఆమె మాజీ ప్రియుడు, పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ కు కూడా తెలియదట. ఈ విషయం తెలుసుకున్న బీబర్ సైతం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడని  సెలెనా వెల్లడించింది. ఇప్పుడు తాను కోలుకుంటున్నానని పేర్కొంది.

  • Loading...

More Telugu News