: దక్షిణాఫ్రికాలో ఇద్దరు క్రికెట్ కోచ్ ల హత్య!

  • దక్షిణాఫ్రికా క్రికెట్ స్టేడియంలో దారుణం
  • ఉద్దేశపూర్వకంగానే ఇద్దరి హత్య
  • ఆసుపత్రిలో మరో ఇద్దరు కోచ్ లకు చికిత్స
  • సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సంతాపం

దక్షిణాఫ్రికాలోని సౌత్ వెస్ట్ ప్రెటోరియాలోని లాడియమ్ క్రికెట్ స్టేడియంలో ఇద్దరు కోచ్ ల మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపుతోంది. మృతులను గివెన్ (24), చార్ల్ సన్ (26)గా గుర్తించారు. వీరిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే ఎవరో హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. ఉదయం యథావిధిగా ప్రాక్టీసుకు వచ్చిన ఉమర్ అస్సద్ అనే క్రికెటర్ కోచ్ లు మరణించినట్టు గుర్తించి, వెంటనే సెక్యూరిటీకి సమాచారం అందించాడు. స్టేడియంలోని క్లబ్ గదిలో మొత్తం నలుగురు కోచ్ లు నివసిస్తున్నారు. వీరిలో మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అనుబంధ కార్యక్రమాల్లో కూడా కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు. మృతి చెందిన కోచ్ లకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంతాపం ప్రకటించింది.  

  • Loading...

More Telugu News