: మందుబాబులకు వడ్డింపు... ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం!

* రూ. 450 లోపు ఫుల్ బాటిల్ పై 3 శాతం

* అంతకుమించిన ధరైతే 9 శాతం

* తక్షణం అమలులోకి పెంచిన ధరలు

* ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ


ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 400 నుంచి రూ. 450 ధర మధ్య ఉండే బ్రాండ్లపై 3 శాతం అదనపు ధర వసూలుకు ఆదేశాలు ఇస్తూ, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జీవో విడుదల చేసింది. ఇక రూ. 450కి పైగా ధర కలిగిన బ్రాండ్లపై 9 శాతం ధరను పెంచాలని పేర్కొంది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించింది. కాగా, అత్యధిక మద్యం బ్రాండ్ల ఫుల్ బాటిల్ ధరలు రూ. 400 నుంచి రూ. 450 మధ్యలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీల మద్యం బ్రాండ్ల ధరలూ పెరిగిపోనున్నాయి. రూ. 450 ధర ఉన్న ఫుల్ బాటిల్ కు ఇకపై రూ. 463.50 అవనుంది. ఇక అంతకుమించిన ధరలో ఉండే మద్యం కావాలంటే మాత్రం జేబుకు చిల్లే!

  • Loading...

More Telugu News