: ఇదిగో స్పైడర్ బోనస్ ట్రాక్.. ఎంజాయ్ చేసుకోండి!: మహేశ్ బాబు!
'ఇదిగో స్పైడర్ బోనస్ ట్రాక్.. ఎంజాయ్ చేసుకోండి' అంటూ సినీనటుడు మహేశ్ బాబు ఈ రోజు ఆ సినిమాలోని ఓ పాటను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ‘అక్కడ ఉన్నవాడు’ అంటూ సాగుతోన్న ఈ పాట మహేశ్ అభిమానులను అలరిస్తోంది. అంతకు ముందు కూడా ఓ ట్వీట్ చేసిన మహేశ్ బాబు.. తన అభిమానులకు, మ్యూజిక్ ప్రేమికులకు ఈ రోజు రాత్రి 9 గంటలకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానని పేర్కొన్నాడు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను గాయని గీతామాధురి పాడింది. ఈ సినిమాకు హేరిస్ జయరాజ్ సంగీతం అందించాడు. కాగా, రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేశ్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.