: పెట్టుబడుల సాధనలో జాతీయ సగటును సైతం అధిగమించిన తెలంగాణ: అసోచామ్ నివేదిక
పెట్టుబడులలో తెలంగాణ.. జాతీయ సగటును అధిగమించిందని అసోచామ్ తన నివేదికలో తెలిపింది. ఈ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలను సైతం అధిగమించడం ఇక్కడ పెట్టుబడులకు స్నేహపూరిత విధానాల వల్లే సాధ్యమైందని తెలిపింది. పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఐదేళ్లలో 79 శాతం వృద్ధిని సాధించిందని, మరోవైపు ఐదేళ్లలో జాతీయ వృద్ధిరేటు 27 శాతంగా నమోదైందని పేర్కొంది. తెలంగాణకు 2011-12లో రూ. 3.03 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2016-17లో రూ.5.09 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది.