: `జిమ్మిక్కి కమ్మల్` పాటకు స్టెప్పులేసిన యాంకర్ సుమ... వీడియో చూడండి!
ప్రస్తుతం కేరళలో ట్రెండ్‌గా మారిన `జిమ్మిక్కి కమ్మల్` పాటకు యాంకర్ సుమ స్టెప్పులు వేసింది. ఆ పాట తనను డ్యాన్స్ చేయకుండా ఆపలేకపోతోందంటూ సుమ.. తన డ్యాన్స్ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పాట ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్ నటించిన ‘వెలిపాడిందే పుస్తగం’ చిత్రంలోనిది. ఈ పాట విడుదలైన నాటి నుంచి దీనికి కాలు కదపని మలయాళీ లేడనడం అతిశయోక్తి కాదమో... అంతలా ప్రాచుర్యం సంపాదించుకుంది ఈ పాట. మొన్నటికి మొన్న అమెరికా టెలివిజన్ యాంకర్ జిమ్మీ కెమ్మెల్ కూడా ఈ పాట బాగుందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కేరళ కుట్టి అయిన సుమకు మోహన్‌లాల్ అంటే చాలా ఇష్టం. `జనతా గ్యారేజ్` షూటింగ్ సమయంలో ఆయనతో ఫొటో దిగి, ఆయన నటనంటే తనకు ఎంత ఇష్టమో ఫేస్‌బుక్ ద్వారా కూడా తెలియజేసింది.