: మానవత్వం లేని ఇంటి యజమాని... చిన్నారి మృతదేహాన్ని రాత్రంతా వర్షంలో ఇంటి బయటే ఉంచిన తల్లిదండ్రులు!


హైదరాబాద్ కూకట్ పల్లి వెంకటేశ్వర కాలనీలో సభ్యసమాజం చీద‌రించుకునేలా ప్రవర్తించాడు ఓ ఇంటి ఓన‌ర్‌. సురేష్ అనే ప‌ద‌కొండేళ్ల చిన్నారి డెంగ్యూతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. త‌మ కొడుకు మృతితో త‌ల్లడిల్లిపోతోన్న ఆ పేద‌ త‌ల్లిదండ్రులు త‌మ కుమారుడి మృతదేహాన్ని నిన్న ‌రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అయితే, మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకురావ‌ద్దంటూ వారి ఇంటి ఓనర్ మోకాలొడ్డాడు.

దీంతో ఇంటి ముందే వ‌ర్షంలో త‌డుస్తూ త‌మ కుమారుడి మృత‌దేహంతోనే ఆ త‌ల్లిదండ్రులు గ‌డిపారు. ఇంటి ముందు ఉన్న అరుగుపై ఆ చిన్నారి మృత‌దేహాన్ని ఉంచి, వాన నీరు ప‌డ‌కుండా దుప్పట్లను ప‌ట్టుకున్నారు. త‌మ ఇంటి ప‌క్క‌న ఉన్న కుటుంబాలు కూడా త‌మ‌కు సాయం చేయ‌క‌పోవ‌డంతో క‌న్నీరు పెట్టుకుంటూ రాత్రంతా అలాగే గ‌డిపారు. ఈ రోజు ఉదయం ఈ విషయం తెలుసుకున్న ఆ కాల‌నీ వాసులు వారికి సాయం చేశారు. ఓ బాక్స్ తీసుకొచ్చి సురేష్‌ మృతదేహాన్ని అందులో ఉంచి, చందాలు వేసుకుని అంత్యక్రియలు జ‌రిపించారు. ఆ ఇంటి ఓనర్ క‌నీస‌ మాన‌వ‌త్వమ‌యినా చూప‌కుండా ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.         

  • Loading...

More Telugu News