: దేశంలో ఏ ఒక్కరి వివరాలు గోప్యంగా లేవు: తేల్చి చెప్పిన నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు


దేశంలో ఏ ఒక్కరి వివరాలు గోప్యంగా లేవని... ఒకవేళ ఎవరైనా అలాంటి భ్రమల్లో ఉంటే వెంటనే బయటపడాలని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. గోప్యత అనే విషయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉండే నమ్మకానికి సంబంధించినదని అన్నారు. వివరాలు గోప్యంగా ఉంటాయని ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా క్రెడిట్ కార్డును ఉపయోగించిన వెంటనే... ఆ కార్డు ద్వారా వారు ఏమేం కొన్నారో తెలిసిపోతోందని... వాటి ఆధారంగా వినియోగదారులకు మార్కెటింగ్ టెలీకాలర్ల నుంచి ఫోన్ కాల్స్ వెళుతుంటాయని... మనం ఏం కొంటున్నామో కూడా టెలీకాలర్లకు తెలిసిపోతున్నప్పుడు, గోప్యత ఉంటుందని ఎలా భావిస్తారని అన్నారు.

ఇదే విషయంలో ఎస్బీఐ ఉప మేనేజింగ్ డైరెక్టర్ మంజు అగర్వాల్ మాట్లాడుతూ, సమాచారం విషయంలో ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. వాట్సాప్, గూగుల్, ఫేస్ బుక్ లను గుడ్డిగా నమ్ముతున్న ప్రజలు... ప్రభుత్వాన్ని మాత్రం నమ్మడం లేదని తెలిపారు. నిజంగా గోప్యత కావాలని కోరునేవారు ముందు వాట్సాప్, ఫేస్ బుక్, గూగుల్ ను వాడటం మానేయాలని అన్నారు.  

  • Loading...

More Telugu News