: మా అబ్బాయి తండ్రి కాబోతున్నాడా? ఇలాగేనా రాసేది?: యువరాజ్ సింగ్ తల్లి ఆగ్రహం
టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి కాబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన భార్య హజెల్ కీచ్‌కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఈ వార్తను వైరల్ చేసేశారు. యువీకి శుభాకాంక్షలు తెలుపుతూ, బుల్లి యువీ పుట్టబోతున్నాడని హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు నానా హంగామా చేస్తున్నారు. ఈ వార్తలపై స్పందించిన యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. తన కోడలు గర్భవతి కాదని తేల్చి చెప్పారు.
అసలు తన కుమారుడికి పెళ్లి అయి 10 నెలలు మాత్రమే అవుతుందని యువీ తల్లి సమాధానం ఇచ్చారు. తన కోడలు గర్భవతి కావడానికి ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలపై ఎందుకు ఇంతగా చర్చలు జరుపుతారని ఆమె ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు ఇలాంటి తప్పుడు వార్తలు రాయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.