: వయసు 85 ఏళ్లు... వృత్తి బాడీ బిల్డర్!... వీడియో చూడండి!
కాలిఫోర్నియాలోని వెనిస్ ప్రాంతానికి చెందిన జిమ్ ఆరింగ్టన్ను ప్రపంచంలో అత్యంత వయస్కుడైన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్‌గా గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించారు. బాడీ బిల్డింగ్ మీద తనకు ఉన్న ఆసక్తి, శ్రద్ధ వల్లే ఇది సాధ్యమైందని ఆరింగ్టన్ అంటున్నాడు. 13 ఏళ్ల వయసులో ఉన్నపుడు ఆరింగ్టన్కు బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి కలిగిందట. తన వయసు పిల్లలందరూ కామిక్ పుస్తకాలు కొంటుంటే.. తాను మాత్రం బాడీ బిల్డింగ్ బొమ్మలు ఉండే పుస్తకాల మీద ఆసక్తి చూపించేవాడినని ఆరింగ్టన్ చెబుతున్నాడు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు తన సత్తువ కొద్దిగా తగ్గినప్పటికీ, బాడీ బిల్డింగ్ మీద తనకు ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదని ఆరింగ్టన్ వివరించాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే ఓ జిమ్‌లో బాడీ బిల్డింగ్ గైడ్‌గా పనిచేస్తున్న ఆరింగ్టన్ అప్పుడప్పుడు జరిగే బాడీబిల్డింగ్ పోటీలలో పాల్గొంటుంటాడు.