: ఫ్యాషన్ రచయిత్రి పెళ్లి వేడుకలో స్టెప్పులేసిన అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్... వీడియో ఇదిగో!
లండన్‌కు చెందిన ఫ్యాషన్ రచయిత్రి అనూషే ముస్సారట్ పెళ్లి వేడుకకు అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రణ్‌వీర్ సింగ్, హృతిక్ రోషన్, కరణ్ జొహార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్‌గా పేరుగాంచిన ద డోర్‌షెస్టర్‌లో ఈ పెళ్లివేడుక జరిగింది. ఈ వేడుకలో హైపర్ యాక్టివ్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఎవర్ యాక్టివ్ అనిల్ కపూర్ స్టెప్పులేశారు. `మై నేమ్ ఈజ్ లఖన్` పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన వీడియో రణ్‌వీర్ ఫ్యాన్‌క్లబ్ వారు ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేశారు. `ఫ్యానీ ఖాన్` సినిమా లుక్‌తో అనిల్ కపూర్, లవర్ బాయ్ గెటప్‌లో రణ్‌వీర్ సింగ్‌లు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి నిర్వహించిన ఈ వేడుకను `వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్`గా నెటిజన్లు పేర్కొంటున్నారు.