: డేరా బాబా కామాంధుడిగా మారడానికి ఈ వ్యాధే కారణమని తేల్చిన డాక్టర్లు!
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరాబాబా 'సిటిరియాసిస్' అనే వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈ వ్యాధితో బాధపడేవారు నియంత్రించలేని కామవాంఛలతో, ఉన్మాదులుగా ప్రవర్తిస్తారని వారు తెలిపారు. రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా బాబాకు ఐదుగురు సభ్యుల వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఈ సందర్భంగా తాను తీవ్రమైన అశాంతికి గురవుతున్నానని, నిద్రలేమితో బాధపడుతున్నానని డాక్టర్లకు గుర్మీత్ తెలిపాడు.
ఈ నేపథ్యంలో, ఇంతకాలం విచ్చలవిడి శృంగారానికి అలవాటుపడ్డ గుర్మీత్... జైల్లో ఆ అవకాశం లేకపోవడంతోనే నిద్రలేమితో బాధ పడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఈ రోగానికి వైద్యం ఉందని... ఆ వైద్యం అందించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వారు అన్నారు. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల నుంచి ఆయన శృంగార ఔషధాలు కూడా తెప్పించుకున్నట్టు తేలిన సంగతి తెలిసిందే. మరోవైపు, డేరా బాబాకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.