: అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై హ‌రికేన్ల ప్ర‌భావం ఉంటుందా?.... చాలా త‌క్కువ అంటున్న ఆర్థికవేత్త‌లు!


ఇటీవ‌ల అమెరికాను అత‌లాకుత‌లం చేసిన హ‌రికేన్ హార్వీ, హరికేన్ ఇర్మాల ప్ర‌భావం అగ్ర‌రాజ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌బోతుంద‌న్న ప్ర‌శ్న‌కు వివిధ యూనివర్సిటీల‌కు చెందిన ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లు మిశ్ర‌మంగా స్పందించారు. రాయిటర్స్ సంస్థ వారు నిర్వ‌హించిన ఈ పోల్‌లో 48 మంది ఆర్థిక‌వేత్త‌లు ఈ ప్ర‌భావం 0.3 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఒక్క బర్ క్లీ యూనివ‌ర్సిటీ ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లు మాత్రం ఈ ప్ర‌భావం 1.0 నుంచి 1.5 శాతం ఉంటుందని తెలిపారు. అయితే ఈ పోల్‌ను హ‌రికేన్ ఇర్మా రావ‌డానికి ముందు నిర్వ‌హించారు.

 గ‌తంలో వ‌చ్చిన హ‌రికేన్ క‌త్రినా, హ‌రికేన్ శాండీలు అమెరికా జీడీపీ వృద్ధిరేటుపై తీవ్రంగా ప్ర‌భావం చూపించాయి. అవి సంభ‌వించిన త్రైమాసిక కాలంలో జీడీపీ దాదాపు స‌గానికి ప‌డిపోయింది. ఈ లెక్క‌న చూస్తే గ‌త యాభై ఏళ్ల‌లో చూడ‌ని విధంగా సంభ‌వించిన హ‌రికేన్ హార్వీ, ఇర్మాల ప్ర‌భావం జీడీపీ వృద్ధిరేటుపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవ‌ల అమెరికా ఆర్థిక వృద్ధి రేటు ప్ర‌తి త్రైమాసికానికి పెరుగుతున్న నేప‌థ్యంలో పెరిగిన వృద్ధిని, హ‌రికేన్ల ద్వారా జ‌రిగిన న‌ష్టానికి స‌ర్దితే లెక్క స‌రిపోతుంద‌ని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News