: ఇక్కడ ఓ దొంగ ఉన్నాడు.. అతన్నే అడగండి: వీవీ వినాయక్


2010లో జూనియర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'అదుర్స్' సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. ఓ పాత్రలో యాక్షన్, మరో పాత్రలో కామెడీ చేస్తూ అభిమానులను అలరించాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా 'అదుర్స్-2' చేయాలనే కోరిక ఇటు తారక్ కు, అటు వినాయక్ కు ఉంది. అయితే, ఇద్దరూ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. దీనికి సంబంధించి ఇద్దరూ కూడా ఎన్నడూ మట్లాడలేదు.

ఇటీవల జరిగిన 'జై లవ కుశ' మూవీ ట్రైలర్ లాంచ్ కు వీవీ వినాయక్ ముఖ్య అథితిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా...అభిమానులు అదుర్స్-2... అదుర్స్-2 అంటూ గోలగోల చేశారు. దీనిపై స్పందించిన వినాయక్ 'కచ్చితంగా చేద్దాం' అన్నాడు. తన పక్కనే ఒక దొంగ ఉన్నాడని, అతనే కోన వెంకట్ అని చెప్పాడు. 'కోనా... వింటున్నావా? ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఓ మంచి కథ రాయవయ్యా. కొద్ది రోజుల్లో అదుర్స్-2 చేద్దాం' అంటూ నవ్వులు పూయించాడు.

  • Loading...

More Telugu News