: వ్యామోహమా? ప్రేమా? తేడా తెలిసిపోతోందన్న తమన్నా


ఈ తరం అమ్మయిలు చాలా మారిపోయారని, ప్రేమ విషయంలో త్వరగా ఓ అభిప్రాయానికి రావడం లేదని, వారికి ప్రేమకు, వ్యామోహానికి ఉన్న తేడా తెలిసిపోతోందని హీరోయిన్ తమన్నా చెబుతోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఎన్టీఆర్ 'జై లవకుశ'లో ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసిన తమన్నా, ఆకర్షణకు, అందానికీ ఇప్పుడెవరూ విలువ ఇవ్వడం లేదని వ్యక్తిత్వాన్ని చూసే ప్రేమ పుడుతోందని అంది.

హోదాను చూసి పుట్టే ప్రేమతో పోలిస్తే, గౌరవం నుంచి పుట్టే ప్రేమ శాశ్వతమని, యువతీ యువకుల మధ్య అవగాహన కూడా చాలా ముఖ్యమైనదని అంటోంది. చేస్తున్న వృత్తిలోని మంచీ చెడులు, సాధక బాధకాలపై జీవిత భాగస్వామికి అవగాహన ఉండాలని, తాను ఎదుగుతూ, పక్కనే ఉండేవారి వృద్ధికీ సాయపడే వ్యక్తులను తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. తన ప్రేమను పొందాలంటే ఈ లక్షణాలుంటే చాలని, ఇంతకుమించి మరేమీ అక్కర్లేదని ఈ అందాల భామ తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పింది.

  • Loading...

More Telugu News