: నడి రోడ్డుపై ట్రాఫిక్ లో చిక్కుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి


నగరాల్లో ట్రాఫిక్ జామ్ లలో ఇరుక్కోవడం సామాన్యులకు సర్వసాధారణ అంశమే. అయితే, ట్రాఫిక్ క్లియరెన్స్ మధ్యలో, భారీ కాన్వాయ్ మధ్య వెళ్లే ఓ ముఖ్యమంత్రి ట్రాఫిక్ లో చిక్కున్నారంటే అది ముమ్మాటికీ ఆశ్చర్యకరమే. ఇలాంటి అనుభవాన్నే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో సిద్ధూ పర్యటించారు. నగరంలోని కేఆర్ పురం పరిధిలో పర్యటించడానికి ఆయన వెళుతుండగా...అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న సిద్ధరామయ్య కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఈ ఘటనతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే, బస్సుకు మరమ్మతులు చేసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

  • Loading...

More Telugu News