: త‌ల‌క‌ట్టు మీద ప్ర‌ముఖులు...హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కొత్త ట్రెండ్‌!... వీడియో చూడండి


కాలంతో పాటు పురుషుల త‌ల‌క‌ట్టు విధానాలు కూడా మారాయి. రోజుకో హెయిర్‌ స్టైల్ ట్రెండ్‌గా మారుతోంది. ఇంట‌ర్నెట్ యుగంలో ప్ర‌పంచంలో ఏ మూల కొత్త హెయిర్‌స్టైల్ వ‌చ్చినా ప్ర‌పంచం మొత్తం దాన్ని అనుస‌రించే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇటీవ‌ల `ప్ర‌ముఖుల హెయిర్‌స్టైల్` కూడా అలాగే ప్రాచుర్యం సంపాదించుకుంది. `ప్రముఖుల హెయిర్‌స్టైల్‌` అంటే సెల‌బ్రిటీలు అనుస‌రించే హెయిర్ స్టైల్ కాదు... త‌ల‌క‌ట్టు మీద ప్ర‌ముఖుల బొమ్మ‌లు త‌ల మీద‌ చెక్కించుకునే హెయిర్‌స్టైల్‌.

`హెయిర్ టాటూస్‌` అని పిలిచే ఈ ర‌క‌మైన త‌ల‌క‌ట్టు చేయ‌డంలో సెర్బియాకు చెందిన మారియో హ్వాలా సిద్ధ‌హ‌స్తుడు. ఎనిమిదేళ్లుగా అత‌ను ఈ హెయిర్ స్టైల్ చేస్తున్నాడు. ఇటీవ‌ల ఓ క‌స్ట‌మ‌ర్ త‌లపై ఉత్త‌ర కొరియా నాయ‌కుడు కిమ్ జాంగ్ ఉన్ బొమ్మ‌ను చెక్కుతున్న వీడియో ఇంట‌ర్నెట్‌లో సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. ఇప్ప‌టివ‌ర‌కు శాస్త్ర‌వేత్త నికోలా టెస్లా, టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జ‌కోవిచ్‌, సెర్బియా ప్ర‌ధాని అలెగ్జాండ‌ర్ వ్యూచిచ్ వంటి ప్ర‌ముఖుల చిత్రాల‌ను మారియో చెక్కాడు. కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే స్ప‌ష్టంగా క‌నిపించే ఇలాంటి త‌ల‌క‌ట్టు కోసం 120 యూరోలు చెల్లించాల్సిందే మ‌రి!

  • Loading...

More Telugu News