: ఆ చిన్నారికి ‘తారకరామ’ అని నామకరణం చేసిన టీడీపీ ఎమ్మెల్యే!
‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పాతగణేశునిపాడులోని పెదమాను కోటేశ్వరరావు ఇంటికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సందర్భంగా, తమ చిన్నారికి నామకరణం చేయాలంటూ యరపతినేనిని కోటేశ్వరరావు కోరారు. దీంతో, తనకు తెలిసిన ఏకైక మంచిపేరు ‘తారకరామ’ అని చెప్పిన ఆయన, ఆ పేరునే ఆ చిన్నారికి పెట్టారు. కాగా, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నందమూరి తారకరామారావు జన్మించింది మే 28. అదే తేదీన ఈ చిన్నారి కూడా జన్మించాడు. ‘తారకరామ’ పేరు పెట్టడంపై చిన్నారి కుటుంబసభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.