: జోర్డాన్ రాణిని కలిసిన ప్రియాంక... తదుపరి కార్యక్రమం ఎమ్మీ అవార్డ్స్!
సిరియా శరణార్థుల పిల్లల సంరక్షణ కోసం యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఇజ్రాయెల్ వెళ్లిన ప్రియాంక ఆ దేశ మహారాణి రనియాను కలుసుకుంది. ఆమెతో దిగిన ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. జోర్డాన్‌లో యునిసెఫ్ కార్యక్రమాలు పూర్తికావడంతో ప్రియాంక తిరిగి లాస్ఏంజెలీస్‌కి బయల్దేరింది. సెప్టెంబర్ 17న అక్కడి మైక్రోసాఫ్ట్ థియేటర్‌లో జరగనున్న ఎమ్మీ అవార్డుల (టెలివిజన్ రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలు) వేడుకకు ఆమె హాజరు కానుంది.
తన టీవీ సిరీస్ `క్వాంటికో` ఈసారి ఒక్క ఎమ్మీ నామినేషన్ కూడా దక్కించుకోలేదు. అయినప్పటికీ ఆమె అవార్డులు అందజేయడానికి అతిథిగా వెళ్లనుంది. గతేడాది ఆమె టామ్ హిడెల్‌టన్‌తో కలిసి ఎమ్మీ అవార్డు అందజేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఎమ్మీ కార్యక్రమానికి రీస్ విదర్‌స్పూన్, నికోల్ కిడ్‌మన్, షైలీన్ వూడ్లీ వంటి హాలీవుడ్ దిగ్గజ నటీమణులు హాజరుకానున్నారు.