: గుర్మీత్ పిలిచాడని చెప్పగానే... తప్పించుకునేందుకు యువతులు వేసే ప్లాన్ ఇది!


డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్, విచ్చలవిడి శృంగారాన్ని అనుభవించి, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న సంగతి తెలిసిందే. ఆపై పోలీసుల సోదాలు, విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గం ద్వారా వెళ్లడం, వారిని తన గదికి పిలిపించుకుని అత్యాచారాలు చేయడం గుర్మీత్ నిత్యకృత్యాల్లో ఒకటని తెలుస్తోంది. ఇక గుర్మీత్ పిలుస్తున్నాడన్న పిలుపు వస్తే, డేరాలో ఉన్న ఏ అమ్మాయి అయినా చచ్చినట్టు వెళ్లాల్సిందే. లేకుంటే కఠిన శిక్షలు తప్పవు.

ఎంతో మందిని గుర్మీత్ లైంగికంగా వేధించాడు. ఇక కొంతమంది మాత్రం ఆయన కబంధ హస్తాలకు చిక్కకుండా తప్పించుకున్నారు. వారిలో ఓ అమ్మాయి తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ, తానెలా గుర్మీత్ నుంచి తప్పించుకున్నానన్న విషయాన్ని తెలిపింది. తనకు నెలసరి వచ్చిందని చెప్పిన ఆమె, తెలివిగా గుర్మీత్ బారిన పడకుండా తప్పించుకుంది.

 'గుఫా' అంటూ తనకు తొలిసారి పిలుపు వచ్చిందని, గుర్మీత్ గదిలోకి వెళ్లిన తరువాతే ఆయన చేసే పనేంటన్నది తనకు అర్థమై పోయిందని, ఆ సమయంలో గుర్మీత్ తన మంచంపై కూర్చుని పోర్న్ వీడియో చూస్తున్నాడని తెలిపింది. ఆపై తనను వచ్చి పక్కన కూర్చోవాలని ఆదేశించాడని, అప్పుడు తాను పీరియడ్స్ లో ఉన్నానని, మీకు ఎదురుగా రాలేనని చెప్పి తప్పించుకున్నానని, తనలాగే ఎంతో మంది ఇదే మాట చెప్పి వచ్చేవారని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News