: నాకు ప్రత్యర్థి రోజా అయినా, మరొకరైనా ఒకటే!: సినీ నటి వాణీ విశ్వనాథ్


ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పింది. వైకాపా మహిళా నేత, నటి రోజాకు మీరు ప్రత్యర్థిగా మారనున్నారా? అన్న ప్రశ్నకు ఆమె తెలివిగా సమాధానం ఇచ్చారు.

 తనకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం, సిద్ధాంతం నచ్చాయని, పార్టీలో చేరిన తరువాత ప్రత్యర్థులు ఎవరైనా తనకు ఒకటేనని, అయితే, సరైన ప్రత్యర్థి ఉంటేనే థ్రిల్ ఉంటుందని చెప్పారు. ఆ ప్రత్యర్థి రోజా అయినా, మరొకరైనా తన పూర్తి సామర్థ్యంతో ఎదుర్కొంటానని చెప్పారు. ఒక మలయాళీగా ఉండి తెలుగు రాజకీయాలపై ఎందుకు ఆసక్తిని చూపుతున్నారన్న ప్రశ్నకు, తనను ఆదరించింది తెలుగు ప్రేక్షకులేనని, చిత్ర రంగంలో తనకు గుర్తింపు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు అంటే తనకు చాలా ఇష్టమని, ఇండియాలో తనకు నచ్చిన గొప్ప నేత చంద్రబాబునాయుడని, అతని మార్గనిర్దేశకత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నానని అన్నారు.

  • Loading...

More Telugu News