: కిమ్ జాంగ్ ను హతమార్చేందుకు స్పెషల్ టీమ్!


తమకు పక్కలో బల్లెంలా తయారైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను మట్టుబెట్టేందుకు దక్షిణ కొరియా ప్రత్యేక టీమ్ ను తయారు చేసినట్టు తెలుస్తోంది. 'స్పార్టన్ 3000' పేరిట ఓ ప్రత్యేక దళానికి కిమ్ ను చంపేందుకు కఠోర శిక్షణ ఇస్తున్నట్టు అమెరికా నిపుణుడు ఒకరు వెల్లడించారు. ఈ టీమ్ ఉత్తర కొరియాలోకి చొరబడి ఆ దేశ ప్రెసిడెంట్ కిమ్ ను హతమార్చి వస్తుందని, నార్త్ కొరియాలోకి ప్రవేశించిన తరువాత దొరికిన వారిని దొరికినట్టు ఈ సైన్యం మట్టుబెడుతుందని తెలిపారు.

కాగా, ఉత్తర కొరియా అధినేతలను హత్య చేసేందుకు దక్షిణ కొరియా ఈ తరహా ఘటనలకు పాల్పడటం ఇదే తొలిసారేం కాదు. గతంలో కిమ్ సంగ్ 2ను చంపేందుకు ఇలాగే ప్రయత్నించి విఫలమైంది. అప్పట్లో ఆయన్ను మట్టుబెట్టేందుకు సరిహద్దులు దాటిన వారిలో కొంతమంది క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకోగా, మిగతావారు శత్రుదేశానికి చిక్కకుండా తమను తామే చంపేసుకున్నారు. కాగా, అణుబాంబులు విసురుతామంటూ బెదిరిస్తూ, వారానికోమారు అణు పరీక్షలు చేస్తూ వచ్చిన ఉత్తర కొరియా, ఇటీవల అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును సైతం ప్రయోగించి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ మనుగడకు కిమ్ ఎప్పటికైనా ప్రమాదమేనని శత్రుదేశాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News