: డేరా వారసురాలిగా విపాసన.. హింస నేపథ్యంలో విచారించనున్న పోలీసులు!


అత్యాచారం కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ శిక్ష అనుభవిస్తుండడంతో ఆయన వారసురాలిగా డేరా చైర్‌పర్సన్ విపాసనను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గుర్మీత్‌ను కోర్టు దోషిగా తేల్చిన అనంతరం జరిగిన హింసకు సంబంధించి పోలీసులు ఆమెను విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. విచారణకు హాజరుకావాల్సిందిగా త్వరలోనే ఆమెను పోలీసులు కోరే అవకాశం ఉందని హరియాణా డీజీపీ బీఎస్ సంధూ తెలిపారు.

మరోవైపు గుర్మీత్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హనీప్రీత్‌తోపాటు డేరా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ఆదిత్య ఇన్సాన్‌ను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరు దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News