: హైదరాబాద్‌ను మరోమారు ముంచెత్తిన వాన.. నాన్‌స్టాప్ వర్షానికి నరకం చూస్తున్న ప్రజలు!


హైదరాబాద్‌లో వరుణుడు మరోమారు విజృంభించాడు. నిన్న సాయంత్రం మొదలైన వర్షం తెల్లవార్లూ నాన్‌స్టాప్‌గా కురుస్తుండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. భారీ వర్షానికి రోడ్లు వాగుల్లా మారిపోయాయి. నాలాలు పొంగి పొర్లడంతో బస్తీల్లోకి నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్,  సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, లాలాపేట ప్రాంతాల్లోని ప్రజలు వాననీటితో ఇబ్బందులు పడుతున్నారు. బండచెరువు కట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరుకున్నాయి.  ఈస్ట్ ఆనంద్‌బాగ్, షిరిడీనగర్, వెంకటేశ్వరనగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. అధికారులు, కార్పొరేటర్లకు చెప్పినా పట్టించుకోలేదని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఇక ఖైరతాబాద్,  పంజాగుట్ట, మైత్రీవనం, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌ రోడ్డు, భైరామల్‌గూడలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరుకుంది.

  • Loading...

More Telugu News