: హైకోర్టు బాహ్య ఆకృతి ప్రపంచానికే తలమానికంగా ఉండాలి: ఆర్కిటెక్టులకు సీఎం చంద్రబాబు సూచన


హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా, ప్రపంచానికే తలమానికంగా ఉండాలని ఆర్కిటెక్టులకు సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతి రాజధానిలో పరిపాలన నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు పలు సూచనలు చేశారు. హైకోర్టు అంతర్గత భవంతి నిర్మాణ శైలి, సౌకర్యాలపై జడ్జిలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తున్నామనే విషయాన్ని ఆర్కిటెక్టులు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి సూచించారు.

  • Loading...

More Telugu News