: జియో బాటలో.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐడియా!
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ బాటలోనే పయనిస్తూ ఐడియా కూడా రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందు కోసం తమ వినియోగదారులు రూ. 697తో రీఛార్జ్ చేసుకోవాలని, ఈ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు మొత్తం 126 జీబీ డేటాను రోజుకి 1.5 జీబీ చొప్పున 84 రోజుల పాటు పొందవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఉచిత అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌ను కూడా పొందవచ్చని తన వెబ్‌సైట్‌లో తెలిపింది. టెలికాం మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో ఇతర అన్ని కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే.